Hyderabad: హైదరాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.3 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో కొలువు

Written by RAJU

Published on:

హైదరాబాద్‌, మార్చి 19: నగరానికి చెందిన యువకుడు అమెరికాలో కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సదరు యువకుడు అమెరికాలోని ప్రముఖ చిప్ప్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని నగరంలోని అతడి తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ చిత్రా లేఅవుట్‌కు చెందిన జి సాయి దివేశ్‌ చౌదరి గురించే మనం చర్చిస్తుంది. అతడి విజయ గాథ ఓ సారి చూద్దాం..

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కృష్ణమోహన్‌ స్థిరాస్తి వ్యాపారి. భార్య శైలజ. రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో టీచర్‌గా ఆమె పదేళ్ల పాటు పనిచేశారు. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు సాయిదివేశ్‌. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన సాయి దినేశ్‌.. ఎన్‌ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత అక్కడే న్యూటానిక్స్‌ కంపెనీలో రూ.40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు.

అనంతరం అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్‌ పూర్తి చేశాడు. కాలిఫోర్నియాలోలోని ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ అయిన ఎన్విడియా కంపెనీలో తాజాగా డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ జాబ్‌కు ఎంపికయ్యాడు. సైన్‌ ఆన్‌ బోనస్, స్టాక్‌ యూనిట్లతో కలిపి మొత్తం వార్షిక వేతనం రూ.3 కోట్ల వరకు వస్తుంది. ప్రస్తుతం సాయి దివేశ్‌ ఎన్విడియాలో విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తండ్రి కృష్ణమోహన్‌ మంగళవారం వెల్లడించారు. పెద్ద కంపెనీలో తమ కుమారుడికి జాబ్‌ రావడం ఎంతో సంతోషంగా ఉందని దివేశ్‌ తండ్రి కృష్ణమోహన్‌ తెలిపారు. దివేశ్‌ చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉండేవాడని ఆయన తెలిపారు. చదువుల్లోనే కాకుండా.. క్రీడలు, ఇతర పోటీల్లోనూ ముందుండేవాడని, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification