
నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు.. కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతూ.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. శిక్షలు విధిస్తున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు.. తాజాగా.. హైదరాబాద్ నగరం పరిధిలో మరో దారుణం చేసుకుంది.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది.. ఈ ఘటన సంచలనంగా మారింది.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నం చేశాడు.. దీంతో యువతి అతన్ని ప్రతిఘటించి.. కదులుతున్న ట్రైన్‌లో నుంచి ఒక్కసారిగా దూకేసింది.. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన ఆ యువతిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి..
వివరాల ప్రకారం..
మేడ్చల్‌లోని హాస్టల్‌లో ఉంటున్న ఆ యువతి సెల్‌ఫోన్ పాడవడంతో సికింద్రాబాద్ వచ్చింది. సెల్‌ఫోన్ బాగుచేయించుకున్న తర్వాత తిరిగి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్ బయల్దేరింది. మహిళల కోచ్‌లో తనతోపాటు ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్‌లో దిగిపోయారు. కాసేపట్లో మేడ్చల్ వస్తుందన్న సమయంలో ఓ దుండగుడు ఆ కోచ్‌లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదులుతున్న ట్రైన్‌లో నుంచి దూకేసింది. ఆమెకు తీవ్ర గాయాలవడంతో జీఆర్పీ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..