– కంచ గచ్చిబౌలి వివాదంలో ఆమె రీపోస్ట్ మాత్రమే చేశారు
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Senior IAS officer Smita Sabharwal), ప్రభుత్వానికి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) ఆమెకు సంఘీభావంగా రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. కంచ గచ్చిబౌలి వివాదంలో ఆమె రీపోస్ట్ మాత్రమే చేశారని, ఆమె చేసిన దాంట్లో తప్పేమిలేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని..
సబర్వాల్‌కు నోటీసు ఇవ్వడాన్ని ఆయన పరోక్షంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా మచ్చలేని అధికారి అని, సుప్రీం కోర్టు వ్యాఖ్యల వల్ల ఆమె బాధపడాల్సి వచ్చిందని దానం అన్నారు. కేసీఆర్(KCR)ను ప్రజలు చూడాలనుకుంటున్నారని దానం అన్నారు. బీఆర్‌ఎస్(BRS) వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభపై భారీ అంచనాలున్నాయని, ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు
పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!
కౌశిక్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట
పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు
ఫస్ట్ టైం తెలుగులో…
Read Latest Telangana News and National News