బుద్ధి మారడం లేదు..
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్‌ను కాపాడేందుకే కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించలేదని బండి ఆరోపణలు గుప్పించారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా.. కేటీఆర్ బుద్ధి మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్, ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో.. కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని సాక్షాత్తు రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు.