Hyderabad: మానవత్వం చాటుకున్న ఆర్పీఎఫ్.. రైల్వే స్టేషన్లో గర్భిణీ ప్రసవం.. తల్లిబిడ్డ క్షేమం.. – Telugu News | Hyderabad: secunderabad rpf team helps pregnant woman give birth on platform

Written by RAJU

Published on:

ఇన్ని రోజులు ఆర్టీసీ బస్సుల్లో, బస్టాండుల్లో, డోలీల్లో మహిళలు పురుడు పోసుకోవడం గురించి విన్నాం. తాజాగా ఓ మహిళ రైల్వే స్టేషన్‌లో ప్రసవించింది. ఈ ఘటన హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. రైల్వే స్టేషన్‌లో పురిటినొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి RPF సిబ్బంది సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వెంటనే స్పందించి.. సాయం అందిచిన ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసులు తెలిపిన డీటేల్స్ ప్రకారం.. ఒడిశాకు చెందిన మహోజీ అనే మహిళ తన భర్తతో కలిసి దుండిగల్‌లో ఉంటోంది. వైజాగ్ వెళ్లేందుకు దంపతులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. గర్భిణీ అయిన న మహోజీకి.. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే ఉన్న RPF ఎస్ఐ మహేశ్ స్పందించి.. ఎమర్జెన్సీ యూనిట్‌గా సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 స్టాఫ్ పరిస్థితిని గమనించి గర్భిణీకి అక్కడే ప్రసవం చేశారు. ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు ఒక బెడ్ షీట్‌తో ఆమెకు రక్షణగా నిలిచి ప్రసవం సురక్షితంగా అయ్యేందకు సహకరించారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్వరితగతిన స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బందికి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. దంపతలు దుండగల్ వద్దనున్న ఇటుక బట్టీల వద్ద పని చేస్తున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification