హైదరాబాద్ సిటీ: నగరంలోని మంథన్ హైస్కూల్(Manthan High School)కు చెందిన విద్యార్థిని హన్సిని ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి ఔట్ స్టాండింగ్ లెర్నర్స్ అవార్డు(Cambridge Outstanding Learners Award) అందుకుంది. ఏఎస్ లెవెల్‌లో ఆర్థికశాస్త్రంలో ప్రపంచ శ్రేణి ఉత్తీర్ణురాలిగా గుర్తింపు పొందుతూ ఆమె అవార్డును పొందారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఏటా కేంబ్రిడ్జి ఔట్ స్టాండింగ్ లెర్నర్స్ అవార్డులు అందిస్తుండగా.. ఈసారి హన్సిని ఎంపికైంది.
ఈ వార్తను కూడా చదవండి: Minister: కొత్త ఉస్మానియా ఆస్పత్రి ద్వారా.. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో తాను విజయం సాధించానని, రుచికా మేడం మార్గనిర్దేశం, ప్రోత్సాహం మరువలేనన్నారు. స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రుచికా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. హన్సిని సాధించిన విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రిన్సిపాల్ సుర్జీత్‌సింగ్(Principal Surjeet Singh) మాట్లాడుతూ.. హన్సిని ప్రతిభతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బంది అందించిన సహకారం ఆమె విజయానికి తోడ్పడిందని పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News
Updated Date – Jan 29 , 2025 | 08:07 AM