Hyderabad: బ్యాంకాక్ టూ హైదరాబాద్.. ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా

Written by RAJU

Published on:

Hyderabad: బ్యాంకాక్ టూ హైదరాబాద్.. ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు 9 కిలోల గంజాయి ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగంలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తనిఖీల్లో పట్టుబడిన గంజాయి ఆయిల్ విలువ దాదాపు 9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తరచుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి తరహా మాదకద్రవ్యాలు పట్టుబడడం చూస్తూనే ఉంటాం. అధికారులు ఎంత కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

గతంలో సైతం గంజాయి పట్టుబడిన సంఘటనలను పరిశీలిస్తే.. పలు విచిత్రాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. డ్రగ్స్, గంజాయి పట్టుబడిన ఘటనల్లో భారీ స్థాయిలో అధిక మొత్తంలో విలువ చేసే పదార్థాలు దొరికాయి. గతేడాది స్వీట్స్, చాక్లెట్ బాక్సుల్లో గంజాయిని తరలిస్తుంటే పట్టుబడిన ఘటనలు కూడా చూశాం. మరో ఘటనలో ఏకంగా విమానాశ్రయంలో పాములు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనలో మరోసారి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ముగ్గురి వద్ద దాదాపు 9 కిలోల గంజాయి ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇండిగో విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ మేరకు 9 కోట్లు విలువ చేసే గాంజా ఆయిల్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, నిందితులను విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights