Hyderabad: తొలిరోజు ఉద్యోగం చేసి ఇంటికి వస్తుండగా ఊహించని సీన్.. సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. – Telugu Information | Younger Engineer Died In Kokapet ORR Accident In Hyderabad, Particulars Right here

Written by RAJU

Published on:

ఫస్ట్ డే.. ఎన్నో ఆశలతో ఉద్యోగానికి వెళ్లిన అతడు తిరిగి ఇంటికి వస్తుండగా.. ప్రమాదం జరిగి మృత్యువాతపడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లో తొలిరోజు ఉద్యోగం చేసి ఇంటికి వస్తుండగా యువ ఇంజనీర్ నవీన్ చారి మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేస్తుంది. నార్సింగి – కోకాపేట్ టీ గ్రీల్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వెహికల్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో నవీన్ చారి చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసిన పొలీసులు.. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

నవీన్ చారీ మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతడు జాబ్ ప్రయత్నంలో ఉన్నాడు. దీనిలో భాగంగానే.. హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో ఇటీవల జాబ్ కొట్టాడు. దీంతో ఎంతో హ్యాపీగా ఉన్నాడు. తొలిరోజు ఆఫీసుకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా అనుకోని ప్రమాదంతో.. నవీన్ చారి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. నవీన్ చారి మృతితో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification