Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ…

Written by RAJU

Published on:

Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ…

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. పల్లి గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మహేశ్వరి- శ్యామ్‌సుందర్‌ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె నాలుగేళ్ల తన్విక మృతి చెందింది.  పోలీసుల వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో మహేశ్వరి- శ్యామ్‌సుందర్‌ దంపతుల నివాసం ఉంటున్నారు. వీళ్లకు కొన్నాళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే వీళ్లకు తన్విక అనే నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. తన్విక తనకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆదంపతులు ఏంతో అళ్లారు ముద్దుగా చూసుకునే వారు. అయితే గత ఆదివారంలో రోజున ఇంట్లో ఆడుకుంటున్న తన్విక.. అక్కడ ఉన్న పల్లీలను తిన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పల్లి గింజలు పాపగొంతులో ఇరుక్కుపోయాయి. దీంతో తన్వికకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది.

అయితే ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కూమార్తెను చూసిన తల్లిదండ్రులు.. అప్రమత్తమై వెంటనే తన్వికను హైదరాబాద్‌లోని నీలోఫర్ చిన్న పిల్లల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ తన్వికను పరీక్షించిన వైద్యులు.. గొంతులో పల్లి ఇరుక్కుపోయినట్టు నిర్ధారించారు. వెంటనే చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం తన్విక ప్రాణాలు విడించింది.

ఎంతో అళ్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు..తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.  ఇక బాధితురాలి తల్లి మహేశ్వరి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights