Hyderabad: ఆహారం.. మారుద్దాం.. ఆరోగ్యం కోసం జొన్న రొట్టెకు పెరుగుతున్న ఆదరణ

Written by RAJU

Published on:

– ఆశావహ జీవనశైలికి నిదర్శనమంటున్న నిపుణులు

హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు రావడం సహజం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లు కూడా ఆశావహ ధృక్పథం దిశగా పయనిస్తున్నాయి. ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు ఇంటిభోజనం అన్ని వేళలా కుదరదు. ఏదో ఒకపూట బయటనుంచి తెచ్చుకుని తిని.. పూట గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇలాఉండగా, పెద్ద వయస్కులు, షుగర్‌ పేషంట్లు(Diabetes patients).. ఇలా వివిధ కారణాలతో చిరుధాన్యాలు, జొన్న రొట్టెలు వంటి వంటలపై ఆధారపడుతున్నారు. ఇప్పటి గృహిణులు చాలామందికి అవిచేసే విధానం తెలీదు.. మైదా పిండితో తయారయ్యే పరోటా, నాన్‌, తందూరి రోటీలలో పిండి పదార్థం తప్పితే అంతగా ప్రయోజనం ఉండదని, అదే జొన్న రొట్టెల్లో పీచుపదార్థం (ఎడిబుల్‌ ఫైబర్‌), మంచి పోషకాలతో పాటు సరళంగా జీర్ణమయ్యే గుణం ఉంటుందని న్యూట్రీషన్‌ రంగ నిపుణులంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మందుల అక్రమ నిల్వలకు అడ్డాగా హైదరాబాద్‌..

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

జొన్న రొట్టెలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాక రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. జొన్నలు గ్లూటెన్‌-ఫ్రీ, తక్కువ కార్బోహైడ్రేట్స్‌ కల్గి ఉంటాయి. వీటివలన హృదయ, ఎముకల పటుత్వం మెరుగుపడుతుంది. ఐరన్‌ అధికంగా ఉండటం కారణంగా రక్త హీనతకు మేలు చేస్తుంది. మరీ అధికంగా తీసుకుంటే గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తవచ్చు

– శ్రీజ, డైటీషియన్‌

నాన్‌లు, తందూరి రోటీలు తినొద్దు

ప్రకృతి ఎవరికి ఏం అవసరమో అవే అందించింది. మనవి ఊష్ణ ప్రాంతాలు, జొన్న సరైన ఆహారం. జొన్న రొట్టెల్లోని పీచు పదార్థాల కారణంగా అన్ని వయసుల వారికి ఇది బాగా జీర్ణం అవుతుంది, కాన్‌స్టిపేషన్‌ సమస్య ఉంటే తగ్గుతుంది. డయాబెటిస్‌ ఉన్న వారికి కూడా ఉపయోగకరం. రెస్టారెంట్లలో దొరికే నాన్‌లు, తందూరి రోటీలు మైదాతో చేసిన దానికన్నా ఇలా జొన్న రొట్టెలను తినటం ఎంతో మేలు చేస్తుంది.

– డా.శ్రీనివాస్‌, ఫిజీషియన్‌

city9.2.jpg

ఆహారపు అలవాట్లలో మార్పు

కరోనా, లాక్‌డౌన్‌ సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు వెళ్లని పరిస్థితుల్లో అంతా స్వయంపాకం, రోగనిరోధకత, పౌష్ఠిక ఆహార ప్రాధాన్యతను ప్రజలు గ్రహించారు. అప్పట్లో ఇంటిభోజనం అలవాటు విశిష్ఠతను కూడా వారు చవిచూశారు.

ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలు!?

ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

Read Latest Telangana News and National News

Subscribe for notification