Hyderabad: ‘అత్యవసర అంబులెన్స్‌’లకు ప్రత్యేక యాప్‌!

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 17 , 2025 | 04:45 AM

అంబులెన్స్‌ సైరన్లు, అంబులెన్సులను ఇటీవలి కాలంలో కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇష్టానుసారంగా, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుండా వెళ్తున్నారు. ఇకపై ఇలాంటి కేటుగాళ్ల ఆట కట్టించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు.

Hyderabad: ‘అత్యవసర అంబులెన్స్‌’లకు ప్రత్యేక యాప్‌!

  • నిజంగా అవసరమైన వారికి ట్రాఫిక్‌ పోలీసుల సహకారం

  • త్వరలో అందుబాటులోకి తేనున్న హైదరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అంబులెన్స్‌ సైరన్లు, అంబులెన్సులను ఇటీవలి కాలంలో కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇష్టానుసారంగా, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుండా వెళ్తున్నారు. ఇకపై ఇలాంటి కేటుగాళ్ల ఆట కట్టించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. హైదరాబాద్‌లో సుమారు 6 వేల అంబులెన్స్‌లు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో 10 శాతం మంది డ్రైవర్‌లు అంబులెన్స్‌లను దుర్వినియోగం చేసినా నగర ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ఈ క్రమంలో అంబులెన్స్‌ సేవలను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక యాప్‌ను తెస్తున్నారు. ఐటీ సెల్‌ అధికారులు, సిటీ పోలీస్‌ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో యాప్‌ను రూపొందిస్తున్నారు.

విధి విధానాలు, ఆస్పత్రి యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవర్‌లు పాటించాల్సిన నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అంబులెన్స్‌ బయల్దేరేటప్పుడు ఆస్పత్రి నిర్వాహకులు ముందుగానే యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. కచ్చితంగా ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాల్సిన అవసరముందా? లేక సాధారణ ట్రాఫిక్‌లో వెళ్లొచ్చా? డ్రైవర్‌ పేరు, ఫోన్‌ నంబర్‌, ఇలా పలు వి వరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అత్యవసరమని ఆస్పత్రి భావిస్తే, కూడళ్ల వద్ద ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు అంబులెన్స్‌ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. త్వరలోనే ఈ యాప్‌ అందుబాటులోకి రానుంది.

Updated Date – Mar 17 , 2025 | 04:45 AM

Google News

Subscribe for notification