– ‘హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్’ ను ప్రవేశపెట్టిన వర్సిటీ
– దరఖాస్తుకు ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ
హైదరాబాద్ సిటీ: అంబేడ్కర్ వర్సిటీ(Ambedkar University)లో ప్రవేశ పెట్టిన ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) కోర్సు వివరాలతో రూపొందించిన గోడపత్రికను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గురువారం విడుదల చేశారు. అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ (ఏఐహెచ్‌సీఎం), కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్), దారుసలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ (డీఈటీ) సంయుక్తంగా నిర్వహించే ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నాలుగు రోజుల శిశువుకు అరుదైన సర్జరీ
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చిలో అర్హత పరీక్ష నిర్వహిస్తామని, మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ ఆనంద్ పవార్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్‌వీకే రెడ్డి, అపోలో ఆస్పత్రి అధికారిణి ప్రొఫెసర్ విజయ రుద్రరాజు, కిమ్స్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవికుమార్, యూనివర్సిటీ అధ్యాపకులు రవీంద్రనాథ్ సోలమన్, పల్లవి కబ్డే, కిరణ్మయి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ భోజరాజు శ్రీనివాస్, డాక్టర్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News
Updated Date – Jan 17 , 2025 | 09:15 AM