- ఇజ్రాయెల్‌పై హౌతీలు క్షిపణుల దాడి
- అమెరికా యుద్ధనౌక లక్ష్యంగా దాడి
- తిప్పికొట్టిన ఇజ్రాయెల్ దళాలు

యెమెన్ నుంచి ఇరాన్ మద్దతుగల హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ విమానాశ్రయం, సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించింది. అమెరికా యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు తెగబడ్డారు. అయితే క్షిపణి దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంది. క్షిపణులను గాల్లో పేల్చేసింది.
హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలోని శత్రు యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా దురాక్రమణకు ప్రతీకారంగానే ఈ దాడులకు తెగబడ్డారు. మార్చి 15న హౌతీలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగానే గురువారం హౌతీ ఉగ్రవాదులు వైమనిక దాడులకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే హౌతీ అధీనంలో ఉన్న భూభాగంపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. గురువారం ఇద్దరు తిరుగుబాటుదారులు చనిపోయినట్లు సమాచారం.