
మేషం
నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
వృషభం
కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.
మిథునం
నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటకం
విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
సింహం
విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కన్య
విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
తుల
మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
వృశ్చికం
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
మకరం
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
కుంభం
బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
మీనం
ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.