HONOR Energy with 6.78 inches 1.5K AMOLED Show, Snapdragon 7 Gen 3, and 8000mAh Battery Launched in China

Written by RAJU

Published on:

HONOR Energy with 6.78 inches 1.5K AMOLED Show, Snapdragon 7 Gen 3, and 8000mAh Battery Launched in China

HONOR Power: హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇక ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అంతేకాక 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. ఫోన్‌ లో Snapdragon 7 Gen 3 (4nm) ప్రాసెసర్, Adreno 720 GPU తో పాటు 8GB / 12GB RAM, 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS 9.0 పై రన్ అవుతుంది.

ఈ ఫోన్ టెన్ – సైడెడ్ యాంటీ ఫాల్ షాక్ అబ్సర్బింగ్ స్ట్రక్చర్ 2.0, 360° వాటర్‌ప్రూఫ్ బాడీ కలిగి ఉంది. నీటిలో ముంచినా, తడిపినా లేదా కడిగినా మొబైల్ పనిచేస్తుంది. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌ ప్రత్యేకతలో బ్యాటరీ ముందుగా ఉంటుంది. ఇందుల 8000mAh మూడో తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీ వాడారు. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఆరు సంవత్సరాల లాంగ్ లైఫ్ కలిగి ఉండడమే కాకుండా, ఇది మొబైల్ ఫోన్‌ల్లో తొలి 8000mAh బ్యాటరీగా రికార్డ్ సృష్టించనుంది. ఈ ఫోన్ 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS (L1+L5), USB టైపు-C, NFC వంటి అనేక అధునాతన కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లు, USB టైపు-C ఆడియో కూడా అందుబాటులో ఉన్నాయి.

స్నో వైట్, ఫాంటమ్ నైట్ బ్లాక్, డెసర్ట్ గోల్డ్ వంటి మూడు రంగుల్లో లభ్యం కానుంది. ధరల విషయానికి వస్తే.. 8GB+256GB – 1999 యాన్స్ (సుమారు 23,310), 12GB+256GB – 2199 యాన్స్ (సుమారు 25,640), 12GB+512GB – 2499 యాన్స్ (సుమారు 29,140)గా నిర్ణయించారు. చైనాలో హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. హానర్ పవర్ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో, గొప్ప బ్యాటరీ లైఫ్‌తో, అత్యుత్తమ డిజైన్‌తో మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. భవిష్యత్తులో భారత మార్కెట్‌లో విడుదలపై మరిన్ని వివరాలు వచ్చే అవకాశముంది.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights