Honda Shine 2025 : ఆకర్షిస్తున్న హోండా షైన్‌ 2025 వేరియంట్‌.. బడ్జెట్‌ ప్రియులకు పండగే..! – Telugu Information | 2025 honda shine 100 launched in india with new colors and up to date engine particulars in telugu

Written by RAJU

Published on:

హెూండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2025 హెూండా షైన్ 100 బైక్‌ను రూ.68,767 (ఎక్స్- షోరూమ్) ధరతో భారతదేశంలో విడుదల చేసింది, ఈ బైక్‌ డిజైన్‌తో మెకానికల్ అప్‌డేట్స్‌తో కంపెనీ లాంచ్‌ చేసింది. కొత్త హెూండా షైన్-100 పాత మోడల్ కంటే రూ.1,867 ధర ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 2025 హెూండా షైన్ 100 కొత్త కలర్ ఆప్షన్లు, కొత్త బాడీ గ్రాఫిక్స్, అప్ గ్రేడ్ చేసిన ఇంజిన్‌తో పాటు ఇతర అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటుంది. డిజైన్‌ విషయానికి వస్తే 2025 హెూండా షైన్-100 కొత్త బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ స్కీమ్‌తో పాటు బ్లాక్ విత్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో ఆకర్షిస్తుంది. అలాగే బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ గ్రే, బ్లాక్ విత్ గ్రీన్ వంటి కలర్‌ ఆప్షన్స్‌లో కొనుగోలుదారులకు ఈ బైక్‌ అందుబాటులో ఉంది. 

హోండా షైన్‌-100 కలర్స్‌ విషయంలో అప్‌డేట్‌ అయినప్పటికీ ప్రాథమిక సీల్‌ అవుట్‌ మారలేదు. అయితే హెూండా కొన్ని చిన్న మార్పులతో డిజైన్‌ను మాత్రం అప్‌డేట్‌చేసింది. కొత్త హెూండా షైన్-100 హెర్ల్యాంప్ కౌల్, ఫ్యూయల్‌ ట్యాంక్, సైడ్ ఫెయిరింగ్ కోసం కొత్త గ్రాఫిక్స్‌ను జోడించింది. అప్‌డేటెడ్‌ షైన్-100 లో హోండా వింగ్ లోగో లేదు. అయితే సైడ్ ఫెయిరింగ్ మాత్రం గత మోడల్స్‌లో ఉన్న ‘ షైన్’ బ్యాడ్జ్ స్థానంలో ‘షైన్-100’ బ్యాడ్జ్‌తో వస్తుంది. ఈ బైక్‌ అల్యూమినియం గ్రాబ్ రైల్, సింగిల్-పీస్ సీటుతో వస్తుంది. 2025 హెూండా షైన్-100 అదే 98.98 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేసిన ఇంజిన్ నుంచి శక్తిని పొందుతుంది.

హోండా షైన్‌-100 2025 వేరియంట్‌లో బైక్‌ ఇంజిన్ ఓబీడీ-2సమ్మతితో వస్తుంది. అలాగే ఫోర్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో వచ్చే ఇంజిన్‌ 7,500 ఆర్‌పీఎం వద్ద 7.28 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 5,000 ఆర్‌పీఎం వద్ద 8.04 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2025 హెూండా షైన్-100 కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. సస్పెన్షన్ డ్యూటీ కోసం షైన్-100 టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులతో ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లతో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification