హెూండా టూ-వీలర్స్ ఇండియా కొత్త యాక్టివా 110, యాక్టివా 125 మోడళ్ల కొనుగోలుపై 3 సంవత్సరాల ఉచిత సర్వీస్ ప్యాకేజీతో పాటు రూ.5,500 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను ప్రకటించింది. హెూండా యాక్టివా 110, హెూండా యాక్టివా 125 రెండూ ఇటీవల 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్‌తో లాంచ్ చేశారు. ఈ రెండు స్కూటర్లు ప్రస్తుతం ఓబీడీ 2బీ కంప్లైంట్ ఇంజిన్‌తో రానున్నాయి. ఈ రెండు స్కూటర్లు భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లుగా రికార్డు సృష్టిస్తున్నాయి. హోండా యాక్టివా తాజా ఆఫర్లను ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ పొందాలనుకునే వారు ఈ ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి వారి సమీప డీలర్షిప్‌ను సందర్శించాలని హోండా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Now’s the time to grab your Honda Activa 110 or 125 and enjoy incredible bonus benefits! Hurry, this exclusive offer ends soon. #Honda #Honda2Wheelers #ThePowerOfDreams #Activa110#Activa125 #ScooterBoleTohActiva pic.twitter.com/9d1TmQ2gou
ఇవి కూడా చదవండి
— Honda 2 Wheelers India (@honda2wheelerin) April 14, 2025
హెూండా యాక్టివా 110
2025 హెూండా యాక్టివా ధర రూ.80,950 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. యాక్టివాలో పవర్ తాజా ఓబీడీ- 2బీ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేటెడ్ 109.51 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ద్వారా వస్తుంది. ఈ స్కూటర్ 8,000 ఆర్‌పీఎం వద్ద 7.8 బీహెచ్‌పీ, 5,500 ఆర్‌పీఎం వద్ద 9.05 ఎన్ఎం పీక్ టార్క్ వద్ద పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అలాగే ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో అప్‌డేట్ చేశారు. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్ప్లే ద్వారా నావిగేషన్, కాల్, ఎస్ఎంఎంస్ అలెర్ట్స్ మరిన్ని ఫంక్షన్లను అందిస్తుంది. ఈ స్కూటర్ యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడాఉంటుంది. 2025 హెూండా యాక్టివా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఎంఎస్ఐ డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ టీవీ జూపిటర్, హీరో ప్లెజర్ ప్లస్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది.
హెూండా యాక్టివా 125
2025 హెూండా యాక్టివా 125 ధర డీఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ.94,922 నుంచి, హెచ్-స్మార్ట్ వేరియంట్ ధర రూ.97,146 (ఎక్స్- షోరూమ్) వరకు ఉంటుంది. 2025 హెూండా యాక్టివా 125 పై పవర్ అప్ గ్రేడ్ చేసిన 123.92 సీసీ, సింగిల్- సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. యాక్టివా 125 కూడా ఓబీడీ 2బీ అప్‌డేటెడ్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ 8.3 బీహెచ్‌పీ, 10.15 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటారు మెరుగైన ఇంధన సామర్థ్యంతో ఐక్లింగ్ స్టాప్ సిస్టమ్లో కూడా వస్తుంది. 2025 యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త 4.2 అంగుళాల టీసీటీ డాష్ బోర్డ్ ఆకట్టుకుంటుంది. హెూండా రోడిసింక్ యాప్ సపోర్ట్ చేసే ఈ స్కూటర్‌లో నావిగేషన్, కాల్/మెసేజ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఆకర్షిస్తాయి. ఈ స్కూటర్‌లో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..