Pre-Holy Tips For SkinCare : పిల్లలు, పెద్దలకు ఎంతో ఇష్టమైన పండుగల్లో హోలీ ఒకటి. ఈ రోజున ప్రజలంతా ఆనందంగా, ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని పండుగను ఆస్వాదిస్తారు. రంగులతో ఇలా ఆడుకోవడం సరదాగా ఉండవచ్చు.. కానీ, అది మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే రంగుల్లో చాలా వరకూ కృత్రిమమైనవే. సరైన జాగ్తత్తలు వహించకపోతే ఇందులోని రసాయనాలు మీ చర్మానికి హాని కలిగించి మీ ఆనందకర క్షణాలను పాడుచేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రంగులు దీర్ఘకాలిక నష్టం కలగవచ్చు. అందుకే హోలీకి ముందే చర్మ సంరక్షణ కోసం ఈ కింది చిట్కాలు పాటించండి..
మాయిశ్చరైజర్..
హోలీ రంగుల్లో చాలావరకూ సింథటిక్ రంగులే ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని పొడిబారేలా చేసి చికాకు కలిగిస్తాయి. ఈ రసాయనాల ప్రభావం మీ చర్మంపై నేరుగా పడకుండా వేడుకలకు ముందే చర్మంపై మాయిశ్చరైజర్‌ను మందపాటి పొరలా పూయండి. ఎమోలియెంట్ మాయిశ్చరైజర్ లేదా నూనె (కొబ్బరి లేదా బాదం నూనె వంటివి) ఉపయోగించడం వల్ల మీ చర్మం డీ హైడ్రేట్ అవదు. వీటిని మందపాటి పొరలా వేసుకుంటే రంగులు మీ చర్మంలోకి చొరబడవు.
సన్‌స్క్రీన్
హోలీ సాధారణంగా పగటిపూట ఇంటి వెలుపలి ప్రదేశాల్లోనే జరుపుకుంటారు. కాబట్టి, సూర్యరశ్మి మీ చర్మానికి హాని కలిగిస్తుంది. మీరు ఎండలో హోలీ ఆడేటప్పుడు UV కిరణాలు చర్మానికి హాని కలిగించకుండా నిరోధించడానికి సన్‌స్క్రీన్ ఒక కవచంగా పనిచేస్తుంది. కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి.
లిప్ బామ్
హోలీకి సిద్ధమవుతున్నప్పుడు ప్రజలు తరచుగా తమ పెదాలను జాగ్రత్త చేసుకోవడం మరచిపోతారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రంగులు మీ పెదాలు పొడిబారేలా చేసి చికాకు పెడతాయి. మీ పెదవులు ఎండిపోకుండా, రంగు మరకలు పడకుండా ఉండటానికి హైడ్రేటింగ్ లిప్ బామ్ లేదా లిప్ మాస్క్‌ను పూయండి.
జుట్టుకు నూనె
హోలీ రంగులు మీ జుట్టును తీవ్రంగా దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి తలపై చికాకు కలిగిస్తాయి. అందుకే ముందు నూనెను పూయడం వల్ల రక్షణ పొర ఏర్పడుతుంది. తద్వారా రంగులు కడుక్కోవడం సులభం అవుతుంది. మీ జుట్టును మృదువుగా ఉండాలంటే.. హోలీ ఆడే ముందు కొబ్బరి లేదా ఆలివ్ నూనె వంటి నూనెను మీ తలపై దట్టంగా రాసుకోండి.
ఎక్స్‌ఫోలియేటింగ్
ఎక్స్‌ఫోలియేటింగ్ అంటే చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయడం వల్ల రక్షణ పొర పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు రంగులలోని కఠినమైన రసాయనాల నేరుగా చర్మం లోతుల్లోకి ప్రవేశించి చికాకుకు గురి చేస్తాయి. మెరుగైన రక్షణ కోసం మీ చర్మానికి సహజ అవరోధం కావాలంటే.. హోలీకి ముందు రోజుల్లో మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయవద్దు.
Read Also : Cholesterol Symptoms : శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై కనిపించే 5 సంకేతాలు..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Diabetes: స్వీట్లు తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర పెరిగితే ఏం చేయాలి?