
తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పు పడుతూ.. 10కిపైగా బిల్లులను ఆమోదిస్తున్నట్లు మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎంకే.స్టాలిన్ స్పందించారు. ఇది చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఈ తీర్పు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయం అని చెప్పారు. కేవలం ఈ తీర్పు తమిళనాడుకి మాత్రమే పరిమితం కాదన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించింది అన్నారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమాఖ్య రాజకీయాల కోసం డీఎంకే పోరాడుతూనే ఉంటుందని స్టాలిన్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Will Pucovski: ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సంచలన నిర్ణయం.. కెరీర్ మొదలు కాకముందే!
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవికి సుప్రీంకోర్టులో మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10కిపైగా బిల్లులను నిలిపివేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుందని జస్టిస్ జెబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది.
స్టాలిన్ ప్రభుత్వం పంపించిన 10 కీలక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్.రవి అడ్డుకున్నారు. ఈ చర్యను స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా విచారించిన న్యాయస్థానం.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. గవర్నర్ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యలు పక్కన పెడుతున్నట్లు కోర్టు పేర్కొంది.
10 బిల్లులను రిజర్వ్ చేయాలని రాష్ట్రపతికి గవర్నర్ రవి సూచించారు. కీలక బిల్లులు ఆమోదం పొందక పోవడంతో స్టాలిన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఆశ్రయించడంతో సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యను పక్కన పెడుతూ.. గవర్నర్ నిలిపివేసిన దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Supreme Court: మమతా ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. సీబీఐ దర్యాప్తును రద్దు చేసిన సుప్రీంకోర్టు..