High Court: నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 15 , 2025 | 05:23 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్‌ 181లో ఉన్న 50 ఎకరాల భూములపై మరో వివాదం తలెత్తింది. అవి భూదాన్‌ యజ్ఞబోర్డు భూములే అని కాంపిటెంట్‌ అథారిటీ కం రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలయింది.

High Court: నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

  • లావాదేవీలకు అనుమతిచ్చి.. ఎలా వెనక్కి తీసుకుంటారు?

  • కాంపిటెంట్‌ అథారిటీ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్‌

హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్‌ 181లో ఉన్న 50 ఎకరాల భూములపై మరో వివాదం తలెత్తింది. అవి భూదాన్‌ యజ్ఞబోర్డు భూములే అని కాంపిటెంట్‌ అథారిటీ కం రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలయింది. ఈఐపీఎల్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఆ సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ శ్రీధర్‌రెడ్డి ఈ పిటిషన్‌ వేశారు. అవి ప్రస్తుతం భూదాన్‌ భూములు కావని, వాటిపై గతంలో లావాదేవీలు జరిపి, ఇప్పుడు ఎలా వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించారు.

దీనిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. భూదానం ద్వారా వచ్చిన భూములను వ్యవసాయం కోసం ఇస్తారని, అవి వారసులకు వెళ్తాయే తప్ప ఇతరులకు బదిలీచేయడానికి వీల్లేదని పేర్కొంది. వివాదంలో ఉన్న భూముల్లో ఇతరత్రా లావాదేవీలు జరిపేందుకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చి.. ఇప్పుడు వెనక్కి తీసుకుంటామని చెప్పడాన్ని పిటిషనర్‌ ప్రశ్నిస్తున్నారని తెలిపింది. ఆ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Updated Date – Mar 15 , 2025 | 05:23 AM

Google News

Subscribe for notification