న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా గేమింగ్, ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ అసాధారణ వృద్ధి నమోదు చేస్తోంది. మిగతా దేశాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగదారులు ఇండియాలోనే ఎక్కువ. దీంతో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ 45 శాతం సీఏజీఆర్ వృద్ధితో 2025 నాటికి 11 బిలియన్ రూపాయలకు చేరుకోవచ్చని ఈవై అధ్యయనం ‘రెడీ.సెట్.గేమ్ ఆన్(Ready.Set.Game On!) పేర్కొంది. దేశంలో 450కు పైగా గేమింగ్ కంపెనీలు, 450 మిలియన్‌లకు పైగా గేమర్లు ఉన్నారని కూడా అంచనా వేసింది.
అయితే దురదృష్టవశాత్తు యువతతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా గేమింగ్‌పై సరైన అవగాహన లేదంటున్నారు హీరో విరెడ్(Hero Vired) ఫౌండర్, సీఈఓ అక్షయ్ ముంజాల్ (Akshay Munjal). ఈ రంగంలో అపారమైన అవకాశాలున్నాయన్న ఆయన.. వాటిని అందిపుచ్చుకునేందుకు యువతకు తాము చేయూత అందిస్తామన్నారు. తాము రూపొందించిన గేమింగ్ కోర్సులు గేమింగ్ పరిశ్రమలో ప్రవేశించేందుకు తగిన తోడ్పాటునిస్తాయన్నారు.
తమ గేమింగ్ కోర్సు వినూత్నమైనదన్న ఆయన ముంజాల్ నాడ్విన్ గేమింగ్ సహకారంతో ప్రత్యేకంగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్టు చెప్పారు. ఆరు నెలల పాటు జరిగే ఈ కోర్సుతో ఔత్సాహికులు గేమింగ్, ఈ స్పోర్ట్స్ పరిశ్రమలో గేమ్ డిజైనింగ్, విజువలైజింగ్, పబ్లిషింగ్, లీగ్ ఆపరేషన్స్, కంటెంట్ క్రియేషన్, లైవ్ ప్రొడక్షన్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చన్నారు.
ఈ కోర్సులో మొదటి రెండు నెలల ప్రైమర్‌గా ఉన్నప్పటికీ, ఆ తరువాత నాలుగు నెలలు మాత్రం స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఫీజు దాదాపు రూ. 4 లక్షలు. ఈ ఫీజులో 50 శాతాన్ని వినూత్నమైన గ్యారెంటీడ్ 5 నెలల ఇంటర్నెషిప్ కార్యక్రమంతో తిరిగి పొందొచ్చని అక్షయ్ తెలిపారు. ఈ ప్రోగ్రాంతో ద్వారా అభ్యాసకుని నైపుణ్యాలను గుర్తించి, వారి కోరికలకు అనుగుణంగా అవకాశాలను అందించేలా తీర్చిదిద్దుతామని అన్నారు. గైడెడ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌తో ఈ కార్యక్రమం ముగుస్తుందని వివరించారు.
గేమింగ్, ఈస్పోర్ట్స్ పరిశ్రమలో రాణించడానికి ఈ సర్టిఫికేషన్ కోర్సు సహాయపడుతుందని ముంజాల్ పేర్కొన్నారు. హీరో విరెడ్ లక్ష్యం పరిశ్రమలో మొట్టమొదటి , నూతన ప్రోగ్రామ్‌లను అందించడమేనని చెప్పారు. ఈ కోర్సులు చేసిన వారు గేమ్ డెవలపర్, గేమ్ ఆర్టిస్ట్, గేమ్ డిజైనర్, గేమ్ ఆడియో ఇంజినీర్ వంటి ఉద్యోగాలలో రాణించవచ్చన్నారు.ఈ-స్పోర్ట్స్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకుంటే లీగ్ ఆపరేషన్స్, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, గేమ్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితర బాధ్యతలను నిర్వర్తించవచ్చని అక్షయ్ ముంజాల్ వివరించారు.
Updated Date – 2023-02-04T17:44:22+05:30 IST