Health Tips: నెల రోజుల పాటు ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే అద్భుతమే!

Written by RAJU

Published on:

Amazing Changes In Body By Eating An Apple Every Day For Month

పండ్లు ఆరోగ్య గుళికలు. పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. రకరకాల పండ్లు ఉంటాయని తెలిసిందే. వాటిల్లో యాపిల్ స్పెషల్. వీటి ధర కాస్త ఎక్కువైన సరే ప్రయోజనాలు కూడా అంతేస్థాయిలో ఉంటాయి. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఆపిల్ తింటే శరీరం లోపలి విషాన్ని తొలగిస్తుంది, అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలనుకుంటే, ఒక నెల పాటు ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం ద్వారా శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయంటున్నారు నిపుణులు.

Also Read:KCR: బీ‌ఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు.. వరంగల్‌లో భారీ బహిరంగ సభ

ఆపిల్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పెక్టిన్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆపిల్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక నెల పాటు ప్రతిరోజూ ఆపిల్స్ తింటే బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆపిల్‌లో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు గుండెకు చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read:Sangareddy: గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

ఆపిల్స్ తగినంత నీరు మరియు పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మూత్రపిండాలు సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. ఒక నెల పాటు ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపి, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆపిల్స్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటాయి. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు. ఆపిల్స్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆపిల్స్‌లో విటమిన్ సి మంచి మోతాదులో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆపిల్ తింటే మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Subscribe for notification