ABN
, Publish Date – Mar 31 , 2025 | 05:25 PM
HCU Issue: తెలంగాణలో ఇప్పుడు హెచ్‌సీయూ వివాదం సంచలనంగా మారింది. యూనివర్సిటీ ఆవరణలో భూముల వేలంపై వివాదం కొనసాగుతోంది. 400 ఎకరాలను రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్ సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు.

HCU Issue
హైదరాబాద్: గచ్చిబౌలి భూములపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఇవాళ (సోమవారం) కీలక ప్రకటన చేశారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తేల్చిచెప్పారు. హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండించారు. ఇప్పటి వరకూ భూమి సరిహద్దులు గుర్తించలేదని అన్నారు. ఈ విషయంపై హెచ్‌సీయూకు సమాచారం ఇవ్వలేదని రిజిస్ట్రార్రు తెలిపారు.
భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్నికోరతామని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ తెలిపారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన టీజీఐఐసీ ప్రకటనను కూడా ఖండించారు. యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీకి కేటాయించిన భూమిని బదిలీ చేయాలి అంటే విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితోనే జరుగుతుందని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News
Updated Date – Mar 31 , 2025 | 05:31 PM