Hasan Nawaz Unbeaten 105 Powers Pakistan to Victory in Auckland Thriller match

Written by RAJU

Published on:


  • ఎట్టకేలకు గెలుపు సాధించిన పాకిస్థాన్.
  • 5 టి20ల సిరీస్ లో మూడో మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్థాన్
  • హసన్ నవాజ్ తుఫాను సెంచరీ
Hasan Nawaz Unbeaten 105 Powers Pakistan to Victory in Auckland Thriller match

NZ vs Pak: న్యూజిలాండ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ టూర్‌లో భాగంగా, నేడు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మూడవ T20I మ్యాచ్ జరిగింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 2-0తో వెనుకబడి ఉండగా, ఈ మ్యాచ్‌లో వారు సిరీస్‌ను సజీవంగా నిలిపేందుకు ప్రయత్నించారు. అయితే, న్యూజిలాండ్ ఆటగాళ్లు గత రెండు మ్యాచ్‌లలోనూ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, ఈ మ్యాచ్‌లో కూడా వారి ఆధిపత్యం చూపించినప్పటికీ హసన్ నవాజ్ తుఫాను సెంచరీతో ఓడిపోవాల్సి వచ్చింది.

Read Also: Mohammed Siraj: ఐపీఎల్ పైనే ఫోకస్.. అవేమీ ఆలోచించను

న్యూజిలాండ్‌లో జరిగిన పాకిస్తాన్‌తో మూడవ T20I మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 19.5 ఓవర్లలో 204 పరుగులు సాధించింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫిన్ అలెన్ తొలి ఓవర్‌లోనే డకౌట్ అయినప్పటికీ, టిమ్ సీఫెర్ట్ 19 పరుగులు, మార్క్ చాప్‌మన్ 94 పరుగులు దూకుడుగా ఆడారు. చాప్‌మన్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 213.63 స్ట్రైక్ రేట్‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడి షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. డారిల్ మిచెల్ (17), జేమ్స్ నీషమ్ (3), మిచెల్ హే (9) వంటి ఆటగాళ్లు మధ్యలో వేగంగా ఔటైనప్పటికీ, కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ 31 ఆఖరి ఓవర్లలో పరుగులు జోడించాడు. ఇష్ సోధి (10), జాకబ్ డఫీ (2), బెన్ సియర్స్ (7 నాటౌట్)లు చివరి వరకు పోరాడారు. పాకిస్తాన్ బౌలింగ్‌లో హారిస్ రవూఫ్ అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. షాహీన్ షా అఫ్రిది (2/36), అబ్బాస్ అఫ్రిది (2/24), అబ్రార్ అహ్మద్ (2/43) కూడా వికెట్లు సాధించినప్పటికీ, న్యూజిలాండ్ బ్యాటర్ల దూకుడును ఆపలేకపోయారు.

Read Also: Ireland: ఐర్లాండ్ అధ్యక్ష పదవికి యూఎఫ్‌సీ ఫైటర్ పోటీ.. ట్రంప్ హామీతో బరిలోకి!

ఇక భారీ లక్ష్య చేధనకు వచ్చిన పాకిస్తాన్ జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలో 207/1 స్కోరుతో ఛేదించి అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ మొహమ్మద్ హారిస్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హసన్ నవాజ్ 45 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే కెప్టెన్ సల్మాన్ ఆగా 51 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో జాకబ్ డఫీ (1/37) మినహా ఎవరూ పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. దీనితో సిరీస్ 2-1తో న్యూజిలాండ్ ముందంజలో ఉంది.

Subscribe for notification