Harvard College sues Trump administration over threats to freeze funding

Written by RAJU

Published on:

  • హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం
  • ట్రంప్ సర్కార్‌పై దావా
Harvard College sues Trump administration over threats to freeze funding

అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ.. ట్రంప్ సర్కార్‌పై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ట్రంప్ పరిపాలనపై యూనివర్సిటీ దావా వేసింది. ప్రభుత్వం బెదిరించి నిధులను నిలిపివేసిందని పేర్కొంది. యూనివర్సిటీ ప్రతిష్టతను ట్రంప్ సర్కార్ దెబ్బతీస్తుందని.. అంతేకాకుండా విదేశీ విద్యార్థులను కూడా బెదిరిస్తోందని దావాలో వాపోయింది. ఈ మేరకు మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

ఇది కూడా చదవండి: Inter Results: నేడు ఇంటర్ ఫలితాలు.. తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జాగ్రత్త?

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక విషయాల్లో దూకుడుగా వెళ్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఇక విదేశీ విద్యార్థులను వెళ్లగొడుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో రిపబ్లికన్లకు వ్యతిరేకంగా యూనివర్సిటీ పని చేసిందంటూ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కార్ కక్ష కట్టింది. అలాగే యూదు మతానికి వ్యతిరేకంగా పాఠాలు చెప్పడం.. హమాస్ మద్దతుగా విద్యార్థులను రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అలాగే పన్ను మినహాయింపును నిలిపివేసింది. అంతేకాకుండా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, ప్రవేశాలు, నియామక పద్ధతులు కూడా మార్చాలంటూ ట్రంప్ లేఖ రాశారు.

ఇది కూడా చదవండి: Sai Pallavi : అవార్డుల కన్న నాకు ప్రేక్షకులే ముఖ్యం..

అయితే ట్రంప్ సర్కార్ ఆదేశాలను హార్వర్డ్ యూనివర్సిటీ తిప్పికొట్టింది. విద్యావ్యవస్థల్లో జోక్యం చేసుకోవద్దని.. మార్పులు, చేర్పులు చేసే ప్రసక్తలేదని తేల్చి చెప్పింది. ఇలా ట్రంప్ సర్కా్ర్‌పై తిరుగుబావుటా ఎగరవేసింది. అయితే ఈ వ్యవహారంపై అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో వైట్‌హాస్ అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పొరపాటున లేఖ వెళ్లిపోయిందని.. కమిటీలో చర్చించకుండానే అధికారి పంపించేసినట్లు పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ సర్కార్‌పై యూనివర్సిటీ దావా వేసింది. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Mulugu District: కానిస్టేబుల్ వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన యువకుడి దారుణ హత్య..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights