Harsha Sai: మంచిగా చెబితే వినుకోలే! ఇప్పుడు చూడు ఏమైందో? హర్షసాయికి బిగ్ షాక్ ఇచ్చిన సజ్జనార్ – Telugu News | Cyberabad Police Files A case against YouTuber Harsha Sai Over On Online Betting Apps

Written by RAJU

Published on:

నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ పైగా తాను గొప్ప పని చేస్తున్నానంటూ సమర్థించుకున్న యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్. సైబరాబాద్ పోలీసులు ఈ యూట్యూబ్ ర్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘నేను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తోన్న పబ్బం గడుపుకొంటోన్న సోషల్ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లతో మాత్రమే పోరాడుతున్నాను. వారు తమను అనుసరిస్తోన్న లక్షలాది మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. అమాయాకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది. దేశ భవిష్యత్ ను అగమ్య గోచరం చేసతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో చాలా మంది యువకులు తమ జీవితాలు ఇలాంటి ఇన్ ఫ్లూయెన్సర్ల చేతిలో పెడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక, ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఇప్పటికే ఎంతో మంది జీవితాలను విఛ్చిన్నం చేశాయి. ఆలస్యం కాకముందే అందరూ మేల్కొండి. బెట్టింగ్ యాప్స్ తో కలిగే నష్టాన్ని గుర్తించండి – ఇది మీ వ్యక్తిగత జీవితానికి, మీ భవిష్యత్తుకు, మీ కుటుంబ శ్రేయస్సుకు, అలాగే మన సమాజ నిర్మాణనికి తోడ్పడుతుంది’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు సజ్జనార్.

కాగా కొన్ని నెలల క్రితం ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు హర్ష సాయి. ఈ కేసులో అతనికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యంది. అయితే బెయిల్ రావడంతో ఊపిరి  పీల్చుకున్నాడు. ఇప్పుడు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ మళ్లీ వివాదంలో ఇరుక్కున్నాడీ యూట్యూబర్. సైబరాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారా? మరి ఈ వ్యవహారం ఎంత దాకా వెళుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఎండీ సజ్జనార్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification