Harish Rao & KTR Chit Chat On Delimitation

Written by RAJU

Published on:

  • కాంగ్రెస్ వైఖరి ఏంటో ఇప్పటిదాకా చెప్పలేదు..
  • అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టారో స్పష్టత లేదు..
  • దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మేం ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్నాం..
  • స్టాలిన్ కంటే ముందు మేము దీనిపై గొంతెత్తాం-కేటీఆర్, హరీష్ రావు
Harish Rao & KTR Chit Chat On Delimitation

KTR- Harish Rao: మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి డిలిమిటేషన్ పై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లేదు.. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీ లిమిటేషన్ పై చెప్పాల్సింది గట్టిగా చెప్తాం.. ఇవాళ్టి అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టారో స్పష్టత లేదు అని వారు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న వివక్ష, అన్యాయంపై మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నామని హరీష్ రావు, కేటీఆర్ తెలిపారు.

Read Also: Betting Apps Case: సుప్రీత, విష్ణుప్రియ, రీతు చౌదరి సహా 11 మందిపై ‘బెట్టింగ్’ కేసు !

ఇక, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కంటే ముందే మేము గొంతు ఎత్తామని కేటీఆర్, హరీష్ రావు చెప్పుకొచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పాలసీపై కేంద్రానికి మేము చెప్తామని తెలిపారు. అలాగే, ఈ నెల 22వ తేదీన తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశంకు మా ప్రతినిధుల బృందం హాజరవుతుందని వెల్లడించారు.

Subscribe for notification