Harish Rao has strongly criticized the Congress government.

Written by RAJU

Published on:

  • కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతు పిత అయ్యారు
  • అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి- హరీష్ రావు
  • కేసీఆర్ ను మార్చురీకి పంపాలి అని మాట్లాడుతావా- హరీష్ రావు
  • నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం పరువు పోతుంది- హరీష్ రావు.
Harish Rao has strongly criticized the Congress government.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బయట బూతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నాం.. కానీ బూతులతో పాటు, అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతు పిత అయ్యారని విమర్శించారు. బూతు సినిమాకు పనికొచ్చే స్క్రిప్ట్ లాగా సీఎం స్పీచ్ ఉంది.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అబద్ధాలకు జీఎస్టీ వేయాలి అన్నారు.. అబద్దాలకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఆదాయం అంతా రేవంత్ రెడ్డి అబద్ధాలకే సరిపోతుందని విమర్శించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలి అని మాట్లాడుతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. పెద్దలు జానారెడ్డి అని గౌరవంగా మాట్లాడేవారని అన్నారు. కానీ నువ్వు కేసీఆర్ చావు కోరుకుంటున్నావు.. నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం పరువు పోతుందని హరీష్ రావు మండిపడ్డారు.

Read Also: Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ..

స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రచర్ మీదకు పోతాడు.. తర్వాత మార్చురీకి పోతాడు అన్నావు.. ఇప్పుడు మాట మారుస్తున్నావని రేవంత్ రెడ్డిపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో మాట మార్చావు.. ఫార్మా సిటీ భూముల విషయంలో రెండు మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీపై కూడా అబద్ధం ఆడారు.. నిన్న అసెంబ్లీలో కూడా రుణమాఫీపై అబద్దాలు మాట్లాడారని తెలిపారు. రుణమాఫీపై తాను సవాల్ విసురుతున్నానన్నారు. కొడంగల్, మధిర, సిద్దిపేట ఎక్కడైనా సరే పోదాం.. రుణమాఫీ పూర్తిగా చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. నిన్న బీజేపీ, రేవంత్ రెడ్డి మైత్రి బయట పడింది.. రాహుల్ గాంధీ ఏమో మోడీ చెడ్డోడు అంటే రేవంత్ రెడ్డి ఏమో మంచోడు అంటున్నాడని హరీష్ రావు చెప్పారు.

Read Also: IPL 2025: ఇది కదా ఐపీఎల్ క్రేజ్.. మ్యాచ్ టిక్కెట్ ఉంటే మెట్రో రైలు, ఎంటీసీ బస్సులలో ప్రయాణం ఉచితం

ఇంకోసారి గెలుస్తాం అని రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో చెప్తున్నాడు.. మీ సంగతి మొన్న తెలిసింది.. పట్టభధ్రులు నిన్ను, నీ కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టారని హరీష్ రావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. నీ పులుసు తీయడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికే భార్యా, బిడ్డలు ఉన్నారా..? ఇతరులకు భార్యా, బిడ్డలు లేరా అని అన్నారు. బాడీ షేమింగ్ పై బూతులు మొదలు పెట్టింది నువ్వే కదా.. కేటీఆర్ కుమారుడు మైనర్‌ను కూడా తిట్టావు కదా.. నా ఎత్తు గురించి కూడా కామెంట్ చేశావ్ కదా అని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 7 వేలు కూడా దాటలేదు.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టారని అన్నారు. పదిహేను నెలలకే నువ్వు రాష్ట్రానికి భారంగా మారావు.. నీది వన్ టైం సెటిల్మెంట్, ఏ సెంటిమెంట్ నీకు సపోర్ట్ చెయ్యదు. నీ పులుసు తీస్తరు ప్రజలు అని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

Subscribe for notification