Gynecologists: పిల్లలను కనడంలో ఆలస్యం వద్దు..

Written by RAJU

Published on:

హైదరాబాద్‌ సిటీ: పిల్లలను కనే విషయాన్ని ఆలస్యం చేయకూడదని, ఒకవేళ పిల్లలు ఆలస్యంగా కావాలనుకుంటే ముందుగానే పురుషులు, మహిళలు తమ వీర్యం, అండాలను ఫ్రీజ్‌ చేయించుకోవాలని గైనకాలజిస్టులు(Gynecologists) పేర్కొన్నారు. నోవా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ, గైనకలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో మంగళవారం సంతాన సాఫల్య సదస్సు నిర్వహించారు. గైనకాలజిస్టులు, ఫెర్టిలిటీ నిపుణులు హాజరై, ఈ సమస్య లోతుల గురించి చర్చించారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA Raja Singh: మరో సంచలనానికి తెరలేపిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. విషయం ఏంటంటే..

తెలంగాణలో సంతానోత్పత్తి, సంతాన సాఫల్య రేటు గణనీయంగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవనశైలి మార్పులు, ఆలస్యంగా గర్భం దాల్చడం, పురుషుల్లో వంధ్యత్వం, జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాలు దంపతుల్లో సంతానరాహిత్య రేటు పెరగడానికి కారణం అవుతున్నాయని వారు పేర్కొన్నారు. సంతానరాహిత్య కేసుల్లో తీరుతెన్నులు ఇటీవల మారుతున్నాయని నోవా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీకి సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్‌ హిమదీప్తి తెలిపారు.

city6.2.jpg

చాలామంది ప్రస్తుతం ఎగ్‌ ఫ్రీజింగ్‌పై అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు. పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్నా గుర్తించడం లేదని, వీర్యానికి సంబంధించిన అంశాలు గణనీయంగా పడిపోతున్నాయని, ధూమపానం, మద్యపానం, ఇతర జీవనశైలి కారణాల వల్ల ఇలా జరుగుతోందని డాక్టర్‌ సరోజ కొప్పల వివరించారు. డాక్టర్‌ శాంతకుమారి, గైనకాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ కార్యదర్శి డాక్టర్‌ మంజుల రావు, డాక్టర్‌ దుర్గా వైట్ల,డాక్టర్‌ దివ్య రెడ్డి పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..

మిస్‌ వరల్డ్‌ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు

త్వరలో ఎకో టూరిజం పాలసీ

డ్రగ్స్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

Read Latest Telangana News and National News

Subscribe for notification
Verified by MonsterInsights