గుంటూరు జిల్లా రాజకీయం మళ్లీ వేడెక్కింది. విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో.. ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఫోన్ కాల్ డేటా తీయించారని ఆరోపించారు. 2021 సెప్టెంబర్‌లో తన సిబ్బంది, వ్యక్తిగత ఫోన్ కాల్ డేటాను ఓ సీఐ, డీఎస్పీతో ట్రాక్ చేయించారని వివరించారు. ఈ ఆరోపణలపై లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు.