- నేడు గుజరాత్ తో రాజస్థాన్ ఢీ
- హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
- గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగనుంది

ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ తో తలపడనుంది. IPL 2025లో గుజరాత్ టైటాన్స్ భీకర ఫామ్‌లో ఉంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. గుజరాత్ తన చివరి మ్యాచ్‌లో KKRను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగనుంది.
Also Read:Suriya : డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
ఆడిన మొత్తం మ్యాచ్‌లు- 7
రాజస్థాన్ గెలిచింది- 1
గుజరాత్ గెలిచింది- 6
ఫలితం తేలనిది – 0
సవాయి మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్, రాజస్థాన్ మధ్య జరిగిన మొత్తం మ్యాచ్‌లు- 2
సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ పై గుజరాత్ గెలిచింది – 2 మ్యాచ్‌లు
సవాయి మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం-0
Also Read:Hit 3 : రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం లో నాని !
సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే.. అది బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్ ప్రారంభంలో బౌలర్లకు అనుకూలం. కానీ ఆట ముందుకు సాగుతున్న కొద్దీ, బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సాధించడంలో సపోర్ట్ చేస్తుంది. బ్యాట్స్‌మెన్ ఎక్కువ పరుగులు సాధించడానికి అవకాశం ఉంటుంది.