- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..
- ముందుగా బ్యాటింగ్ చేయనున్న గుజరాత్ టైటాన్స్..
- సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మరికాసేపట్లో మ్యాచ్ ఆరంభం..
- ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో గుజరాత్, 9వ స్థానంలో రాజస్థాన్

GT vs RR: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు (సోమవారం) రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. రాజస్థాన్‌కు ప్లేఆఫ్ ఆశలు నిలబడాలంటే ఈ మ్యాచ్ కీలకం. ఇకపోతే, నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే స్థానంలో మెహష్ తీక్ష్ణ, యుధ్వీర్ సింగ్ చరక్‌లు చోటు దక్కించుకున్నారు. గుజరాత్ కరీం జనత్ కు ఐపీఎల్ లో అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఈరోజు గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓడిపోతే, ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా ఆవిరైపోతాయి. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆర్‌ఆర్ ఏడు ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో RR వరుస పరాజయాలను చవిచూసింది. దానితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే, సొంతగడ్డపై గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. ప్రస్తుత సీజన్‌లో అహ్మదాబాద్‌లో ఈ ఇరు జట్లు తలపడినప్పుడు, గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్, 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పట్టికలో రెండవ స్థానంలో ఉంది. గుజరాత్ మరో విజయం సాధిస్తే ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ ఖాతాలో ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి. ఇక నేటి ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: IND vs Ban: పాక్‌తో పాటు బంగ్లాదేశ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్ (క్యాప్టెన్), సాయి సుధర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, మహమ్మద్ సిరాజ్, ప్రకాశిత్ కృష్ణ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఇషాంత్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, దసున్ షానకా
Read Also: Buffalo Milk vs Cow Milk: గేదె పాలా లేక ఆవు పాలా..? ఏవి తాగితే ఎక్కువ ప్రయోజనం.!
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (క్యాప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శిమ్రాన్ హేత్మయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష్ థిక్షన, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: శుభమ్ దుబే, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్టికేయ, ఆకాశ్ మధ్వాల్, కునాల్ సింగ్ రాథోర్