GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్.. అహ్మదాబాద్‌లో హార్దిక్ సేన చెత్త రికార్డ్

Written by RAJU

Published on:


GT vs MI Match Report: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని సాధించగా.. ముంబై ఇండియన్స్ మాత్రం వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. అహ్మదాబాద్‌లో జరిగిన 9వ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. గిల్ సారథ్యంలోని గుజరాత్ జట్టు 36 పరుగుల తేడాతో హార్దిక్ పాండ్యా జట్టును ఓడించింది. అహ్మదాబాద్‌లో గుజరాత్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ముంబైని ఓడించడం విశేషం.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గుజరాత్ టైటాన్స్ తరపున సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతను 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. అతనితో పాటు జోస్ బట్లర్ 39 పరుగులు, శుభ్‌మాన్ గిల్ 38 పరుగులు చేశారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబుర్ రెహమాన్, ఎస్ రాజు తలో వికెట్ పడగొట్టారు.

ఇక ఛేజింగ్‌లో ముంబై జట్టు తరపున సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు, తిలక్ వర్మ 39 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కగిసో రబాడ, సాయి కిషోర్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

పాయింట్ల పట్టికలో మార్పులు..

ఈ సీజన్‌లో గుజరాత్ తొలి విజయాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా 2 పాయింట్లతో టైటాన్స్ జట్టు 3వ స్థానానికి చేరుకుంది.

మరోవైపు ముంబై వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ప్రస్తుతం ముంబై జట్టు 9వ స్థానంలో నిలిచింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, ఆర్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్.

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights