
GST on health and life insurance: మధ్య తరగతి, దిగువ తరగతికి గుడ్ న్యూస్ రానుంది. త్వరలోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు మిడిల్ క్లాస్ , లోయర్ మిడిల్ క్లాస్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కేంద్రం 18% GST ఛార్జ్ చేస్తోంది. కానీ త్వరలోనే ఈ జీఎస్టీని 5 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
జాన్ లేదా జూలై ఆరంభంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ( GST Council meeting ) జరగనుంది. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాదు, ఇన్సూరెన్ పాలసీలపై ప్రీమియంను 5 శాతానికి తగ్గించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
వాస్తవానికి ఇదే విషయమై విపక్షాలు ఎప్పటి నుండో కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. గతేడాది చివర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే కేంద్రం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు.