Kedar Jadhav Joins BJP: టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఏప్రిల్ 8, మంగళవారం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, అశోక్ చవాన్ సహా ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
పూణే నివాసి కేదార్ జాదవ్ టీమిండియా తరపున 73 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను 42.09 సగటుతో 1389 పరుగులు చేశాడు. 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 122 పరుగులు చేశాడు. ఈ మాజీ ప్లేయర్‌కు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌లో వన్డే ఫార్మాట్‌లో 27 వికెట్లు పడగొట్టాడు.
కేదార్ జాదవ్ ఐపీఎల్‌లో 5 జట్ల తరపున ఆడాడు. 95 మ్యాచ్‌ల్లో 1208 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్‌లో జాదవ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.
#WATCH | Former Indian Cricketer Kedar Jadhav joins BJP in the presence of Maharashtra minister and state BJP chief Chandrashekhar Bawankule in Mumbai. pic.twitter.com/4reAKk7F1Y
— ANI (@ANI) April 8, 2025
టీమిండియా తరపున కేదార్ జాదవ్ 2014 నవంబర్ 16న శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. ఇక తన చివరి మ్యాచ్‌ను 2020 ఫిబ్రవరి 8న ఆడాడు.
అలాగే, తన తొలి టీ20 మ్యాచ్‌ను జులై 2015లో ఆడగా, చివరి మ్యాచ్ అక్టోబర్ 2017లో ఆడాడు.