Group 2 Results: గ్రూప్‌-2 ర్యాంకింగ్‌ జాబితా ఎప్పుడంటే..

Written by RAJU

Published on:

హైదరాబాద్‌: తెలంగాణ (Telangana రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు (Group Exams) రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మంగళవారం గ్రూప్ 2 (Group-2) పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ (General Rankings) వెలువడనున్నాయి. రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్‌సీ (TGPSC) ఈరోజు వెల్లడించనుంది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్‌ ర్యాంకు జాబితాను ప్రకటించనుంది.14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది.

Also Read..:

క్రికెటర్ ఛాహల్‌తో డేటింగ్..

కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం ప్రకటించింది. ఫలితాలను అభ్యర్థులు టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చు. ఈనెల 16 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు మార్కులను చూసుకోవచ్చని, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ తెలిపింది. రీకౌంటింగ్‌కు 15 రోజుల గడువు ఇచ్చారు. దీనికోసం ప్రతి పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో పలువురికి 60 శాతం మార్కులు దాటి వచ్చాయని తెలిసింది.

సోమవారం సాయంత్రం వరకు అందించిన సమాచారం మేరకు హన్మకొండ విద్యానగర్‌కు చెందిన జిన్న తేజస్విని 532.5 మార్కులు సాధించారు. జనరల్‌ ఎస్సేలో 79.5, హిస్టరీ, కల్చర్‌, జాగ్రఫీలో 102, ఇండియన్‌ సొసైటీ, కానిస్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌లో 89.5, ఎకానమీ అండ్‌ డెవల్‌పమెంట్‌లో 113.5, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో 68, తెలంగాణ మూమెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌లో 80 మార్కులు సాధించారు. అర్హత పరీక్ష జనరల్‌ ఇంగ్లి్‌షలో తేజస్విని 150కి 121 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించినవారి వివరాలపై రీకౌంటింగ్‌ గడువు ముగిశాక 15 రోజుల తర్వాత స్పష్టత రానుంది. టీజీపీఎస్‌సీ ముందుగా ప్రకటించిన ప్రకారం గ్రూప్‌-2 పరీక్ష జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను ఈరోజు విడుదల చేయనుంది. అలాగే గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను 14న విడుదల చేయనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

దళిత ద్రోహి జగన్

బడిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

For More AP News and Telugu News

Updated Date – Mar 11 , 2025 | 08:47 AM

Subscribe for notification