ఇంటర్నెట్ డెస్క్: దాదాపు అన్ని వయసుల వారికీ నచ్చే పండ్లు ద్రాక్షలే. అయితే, మనం మార్కెట్లో ఆకుపచ్చ రంగులో ఉండే సాధారణ ద్రాక్షలతో పాటు నల్ల ద్రాక్షలు కూడా కనిపిస్తుంటాయి. మరి ఈ రెండిట్లో ఏది బెటర్ అనే సందేహం కలిగిందా? అయితే, సమాధానం కోసం ఈ కథనం తప్పక చదవాల్సిందే (Green Grapes Vs Black Grapes)..
నిపుణులు చెప్పేదాని ప్రకారం, నల్ల ద్రాక్షల్లో రెస్విరాట్రాల్ సహా అనేక యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను నిరోధించేందుకు క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు అత్యవసరం. వీటితో పాటు నల్ల ద్రాక్షల్లో పీచు పదార్థం, విటమిన్ సీ, విటమిన్ కే, ఫ్రక్టోర్ అనే ఒకరకమైన చక్కెర పుష్కలంగా ఉంటాయి.
Coffee: ఈ సమస్యలుంటే కాఫీ తాగొద్దు!
నల్ల ద్రాక్షల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. కణాలపై ఇన్‌ఫ్లమేషన్ ప్రభావం పడకుండా రక్షిస్థాయి. డయాబెటిస్, ఆల్జైమర్స్ వ్యాధి, గుండె జబ్బులు, పార్కిన్సన్స్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయి. రెస్వెరాట్రాల్.. గుండె, మెదడుకు ఓ రక్షణ కవచంగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వయసు ప్రభావం తగ్గించి యవ్వన కాంతులీనేలా చేస్తుందని చెబుతున్నారు.
సాధారణ ద్రాక్షతో ఉపయోగాలు
సాధారణ ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ సీ, విటమిన్ కే, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ ద్రాక్షల్లోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక హైబీపీ నియంత్రణకు ఆకుపచ్చ ద్రాక్షలకు మించినవి లేవని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు.
Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!
రెండింట్లో ఏది బెటర్..
వాస్తవానికి రెండు రకాల ద్రాక్షల్లోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రెండిటితోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి, ఈ రెండు ద్రాక్షల్లో జనాలు వారి వారి అభిరుచి, ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఎంచుకోవచ్చు. ఉదాహరణ తీపి ఎక్కువగా ఉన్న పండ్లను ఇష్టపడేవారికి నల్ల ద్రాక్ష బాగా నచ్చుతుంది. ఇక కెలొరీలు ఎన్ని తీసుకుంటున్నామనే విషయంలో అప్రమత్తంగా ఉండేవారికి ఆకు పచ్చ ద్రాక్షలు తినడమే ఉపయుక్తం. అయితే, యాంటీఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉండాలంటే మాత్రం నల్ల ద్రాక్షే బెటర్. ఇక ఆహార నియమాలు ఉన్న వారికి ఆకుపచ్చ ద్రాక్షే బెటరని నిపుణులు చెబుతున్నారు.
Read Latest and Health News