ఈ విభాగంలో హోండా అమేజ్, టాటా టిగోర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. హోండా కంపెనీ 2024 డిసెంబర్‌లో అప్‌గ్రేడ్ చేసిన అమేజ్ కారును విడుదల చేసింది. టాటా 2025 జనవరిలో టిగోర్ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల మధ్య ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.
ప్రత్యేకతలు
టాటా టిగోర్ కారులో ప్రత్యేకతల విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, హెచ్‌డీ రివర్స్ పార్కింగ్ డిజిటల్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్‌లు, 360 డిగ్రీల కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఎలక్ట్రానిక్ స్బెబిలిటీ ప్రోగామ్, హిల్‌హూల్డ్ కంట్రోల్, రియర్ డీఫాగర్ బాగున్నాయి.
హోండా అమేజ్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఫీచర్ ఏర్పాటు చేశారు. లేన్‌వాచ్ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్, ఆటో హైబీమ్, లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ అదనపు ప్రత్యేకతలు.
ఇంజిన్
టాటా టిగోర్‌లో 1199 సీసీ పెట్రోల్, ద్వి ఇంధన ఇంజిన్ అమర్చారు. పెట్రోల్ ఇంజిన్ నుంచి 85 బీహెచ్‌పీ శక్తి, 113 ఎన్‌ఎం టార్క్ విడుదల అవుతుంది. సీఎన్‌జీపై 72 బీహెచ్‌పీ, 95 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి జరుగుతుంది.
హోండా అమేజ్‌లో కూడా 1199 సీసీ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 89 బీహెచ్‌పీ శక్తి, 110 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది.
ఇవి కూడా చదవండి
మైలేజీ
టాటా కారులోని మాన్యువల్ (పెట్రోలు) వేరియంట్ లీటర్‌కు 19.28 కిలోమీటర్లు, ఆటోమేటిక్ (పెట్రోలు) వేరియంట్ 19.60 కిలోమీటర్లు, మాన్యువల్ (సీఎన్‌జీ) వేరియంట్ కిలోగ్రాముకు 26.49 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
హోండా అమేజ్ విషయానికి వస్తే మాన్యువల్ (పెట్రోలు) వేరియంట్ 18.65, ఆటోమేటిక్ (పెట్రోలు) వేరియంట్ 19.46 కిలోమీటర్ల మైలేజీ అందిస్తాయి.
ధర వివరాలు
- టాటా టిగోర్ కారులోని బేస్ వేరియంట్ ధర రూ.5,99,990 (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీనిలోని టాప్ వేరియంట్ రూ.9,44,990 (ఎక్స్‌షోరూమ్) వరకూ పలుకుతుంది.
- హోండా అమేజ్ కారు రూ.8,09,900 నుంచి రూ.11,19,900 (ఎక్స్‌షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి