- సీతారాంబాగ్ ఆలయంలో గవర్నర్ కు ఘన స్వాగతం
- సీతారాంబాగ్ ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
- శంకరాచార్యుల ధర్మ పరిరక్షణ యాత్రను గుర్తు చేసిన గవర్నర్
- మోడీ రాముని మార్గంలోనే దేశాభివృద్ధి దిశగా పయనం
- ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గోషామహల్ లోని సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. “ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. రాముడు ఏం చేసినా ధర్మ రక్షణకోసం చేశాడు. భగవాన్ రామ్ ధర్మ స్థాపనకు మార్గదర్శకుడు. భారత దేశా సంసృతి.. సంప్రదాయాలకు రాముడు ఆదర్శం. ప్రతి పౌరుడు భగవాన్ శ్రీరామ్ ను ఆదర్శం తీసుకోవాలి. ఆయన మార్గంలో నడిచి దేశాభివృద్ధికి పాటు పడాలి. ప్రధాని మోడీ సబ్ కా సబ్ కా వికాస్ పేరుతో రామ మార్గంలో నడుస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’!
గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అనంతరం భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి శోభయాత్రను గవర్నర్ ప్రారంభించారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభా యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోఠి హనుమాన్ టెకడి వరకు వేలాది మంది భక్తుల ర్యాలీగా ఈ శోభయాత్ర నిర్వహించనున్నారు.
READ MORE: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయి!