Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇది చేయకపోతే ఇబ్బందులే..!

Written by RAJU

Published on:

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇది చేయకపోతే ఇబ్బందులే..!

గూగుల్ క్రోమ్.. అందరికీ తెలిసిన సెర్చ్ ఇంజిన్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం మంది వినియోగించే సెర్చ్ ఇంజిన్ ఇదే. ఎటువంటి డేటా కావాలన్నా, ఎలాంటి సమాచారం అవసరమైన వెంటనే గూగుల్ చేయడం అలవాటు అయిపోయింది. వ్యక్తిగత ల్యాప్ టాప్ లు, ఇల్లు, ఆఫీసుల్లో ఉండే కంప్యూటర్లలో దీనిని ఎక్కువ శాతం మంది వినియోగిస్తుంటారు. మీ ఇంట్లో కూడా గూగుల్ క్రోమే వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అధిక తీవ్రతగల హెచ్చరికను జారీ చేసింది. వెంటనే తమ వెర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. లేకుంటే మీ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం హెచ్చరిక ఏమిటి? సమస్య ఎక్కడ ఉంది? ఏ వెర్షన్ గూగుల్ క్రోమ్ లో సమస్య ఉంది? దానిని కనుగొనాలంటే ఏం చేయాలి? తెలియాలంటే ఈ కథనం చివరి వరకూ చదివేయండి..

సమస్య ఏంటి..?

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ప్రకారం, గూగుల్ క్రమ్ లో బహుళ దుర్బలత్వాలు(వల్నరబులిటీస్) గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇవి దాడి చేస్తే మీ కంప్యూటర్ హ్యాకింగ్ గురయ్యే ప్రమాదం ఉంది. రిమోట్ యాక్సెస్ తీసుకునే అవకాశం ఉందని నివేదించింది. తద్వారా డేటాను మార్చడానికి, సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రమాదం ఉందని వివరించింది. అలాగే కాజ్ డినైయల్ ఆఫ్ సర్వీస్(DoS) స్థితికి కంప్యూటర్ వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది. ఒక సిస్టమ్ లేదా నెట్‌వర్క్ ట్రాఫిక్‌తో నిండిపోయి, దాని సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించే హానికరమైన దాడి కారణంగా డాస్ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల సిస్టమ్ పనితీరు మారిపోతుంది. దానిలోని ప్రైవసీని కోల్పోతుంది. సున్నితమైన డేటాను బహిర్గతం అవుతుంది.

ఎవరికి ప్రమాదం..?

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరిక ప్రకారం, డెస్క్‌టాప్ లో గూగుల్ క్రోమ్ వాడుతున్న వినియోగదారులు ఈ వల్నరబులిటీ ద్వారా ప్రభావితమవుతారు, వినియోగదారు సంస్థ, వ్యక్తులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. ప్రభావితమైన సాఫ్ట్‌వేర్‌లలో విండోస్, మ్యాక్ 134.0.6998.88/.89 కి ముందు ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్‌లు, లైనక్స్ వినియోగదారుల అయితే 134.0.6998.88 కి ముందు ఉన్న వెర్షన్‌లు ఉన్నాయి.

మీ బ్రౌజర్ ఏ వెర్షన్ తెలియాలంటే..?

  • మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఏ వెర్షన్‌లో పనిచేస్తుందో తెలియాలంటే ఇలా చేయాలి.
  • క్రోమ్ బ్రౌజర్‌లో కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి.. ‘సెట్టింగ్‌లు’కి వెళ్లండి. డ్రాప్-డౌన్ మెనులో కిందికి స్క్రోల్ చేయడం ద్వారా ‘హెల్ప్’ ఎంపికపై మౌస్ కర్సర్ ను ఉంచడాలి. అప్పుడు మీకు మరో ఉప మోనూ కనిపిస్తుంది. దానిలో అబౌట్ గూగుల్ క్రోమ్ ఆప్షన్ ను ఎంచుకోండి. దీన్ని ఎంచుకున్న తర్వాత, కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీనిలో గూగుల్ వెర్షన్ మీకు కనిపిస్తుంది.

అప్ డేట్ ఎలా చేయాలి..?

మీ క్రోమ్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్న అప్ డేట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి, పైన పేర్కొన్న విధంగానే ‘అబౌట్ గూగుల్ క్రోమ్’ ట్యాబ్‌నకు చేరుకోండి. మీరు కొత్త ట్యాబ్‌కు చేరుకున్న తర్వాత, డౌన్‌లోడ్ చేయడానికి లేదా ఇన్‌స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఏవైనా అప్ డేట్ ను బ్రౌజర్ మీకు ప్రదర్శిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification