Gold Worth: తొలిసారిగా లక్ష దాటిన బంగారం ధర.. ఎందుకు పెరుగుతోంది.. తులం ఎంతో తెలుసా? – Telugu Information | Gold worth crosses one lakh rupees for the primary time

Written by RAJU

Published on:

దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర తొలిసారిగా లక్ష మార్కును దాటింది. పెరిగిన పసిడి ధరలు మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి ప్రస్తుతం తులం బంగారం ధర లక్షా 135 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి లక్షా ఒక వేయి రూపాయల వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో లక్షా 10 వేల వద్ద కొనసాగుతోంది. స్వచ్ఛమైన పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. ఇలాంటి సమయంలో అందరికీ ఒకే ప్రశ్న. ఈ గోల్డ్‌ రేట్‌ ఎప్పుడూ పెరగడమేనా, తగ్గడం అంటూ ఉండదా అని. గతంలో ఎప్పుడైనా తగ్గి ఉంటే.. ఆ శుభసందర్భాలేంటి? ఎందుకని తగ్గింది? అసలు.. బంగారం ధర పెరగడానికి కారణాలేంటి?

డాలర్ ఇండెక్స్ గత మూడు నెలల్లో 10 శాతానికి పైగా క్షీణించి 99 మార్కు దిగువకు చేరింది. దీనికి తోడు అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి.

వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం, ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. రాబోయే పండుగల సీజన్‌లో దేశీయంగా డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బంగారం ధరను సాధారణంగా డాలర్‌లలో నిర్ణయిస్తారు. డాలర్ విలువ తగ్గినప్పుడు, ఇతర కరెన్సీలు కలిగిన కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారుతుంది. డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తారు. బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక రక్షణగా పరిగణించబడుతుంది. కాబట్టి డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది.

యుద్ధాలు, రాజకీయ అస్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాలలో ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల గురించి ఆందోళన చెందుతారు. అటువంటి సమయాల్లో బంగారం ఒక సురక్షితమైన స్వర్గధామంగా మారుతుంది. దాని డిమాండ్, ధర పెరుగుతాయి.

భారత్‌లో ఎక్కువ బంగారం దిగుమతి:

భారతదేశం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడినప్పుడు, బంగారం దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ రూపాయలు చెల్లించవలసి వస్తుంది. దీనివల్ల దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయి. భారతదేశంలో పండుగలు, వివాహాల సమయంలో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: Adulterated Petrol, Diesel: కల్తీ పెట్రోల్, డీజిల్‌ను చెక్‌ చేయడం ఎలా? వాహనానికి ప్రమాదం ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights