Gold Value At the moment: పసిడి పరుగో పరుగు.. కనివినీ ఎరుగని రీతిలో ఆల్‌టైం హైకి గోల్డ్ ధర.. తులం ఎంతంటే – Telugu Information | Gold And Silver Charges In Chennai, Hyderabad, Vijayawada, Bangalore On April 22

Written by RAJU

Published on:

ప్రపంచవ్యాప్తంగా బంగారం పరుగులు ఆగట్లేదు. భారత్‌లో లైవ్‌ మార్కెట్‌లో ఇప్పటికే 10గ్రా. పసిడిధర లక్ష దాటింది. రిటైల్‌ మార్కెట్‌లో కూడా ఇవాళ లక్షమార్క్‌ దాటే చాన్స్‌ కనిపిస్తోంది. రూ.లక్ష మార్క్‌కి గోల్డ్‌ ధర కేవలం రూ.500 దూరంలోనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10గ్రా. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.99,500గా ఉంది. బంగారం ధరలు మన దేశంలో పెరగాలంటే, ముందు అంతర్జాతీయంగా పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌ ఆధారంగానే, మనదేశంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దూకుడు మీదుంది. ఇప్పటికే 3450 డాలర్ల మార్క్‌ను ఔన్స్‌ బంగారం ధర దాటింది. అటు లక్ష మార్కుదాటినా గోల్డ్‌ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు వడ్డీరేట్లను తగ్గించాలని యూఎస్‌ ఫెడ్‌పై ట్రంప్‌ ఒత్తిళ్లు చేస్తున్నారు. ఫెడ్‌ స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని అమెరికాలో ఆందోళనలు కూడా చెలరేగాయి. ఒకవైపు సుంకాలు.. మరోవైపు ఫెడ్‌పై ట్రంప్‌ ఒత్తిళ్లతో.. కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధర పెరుగుతూపోతోంది.

ఇక గోల్డ్‌ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. బంగారం-లకారం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆడపిల్ల పెళ్లి ఎలా చేయాలిరా దేవుడా అంటూ జనం వాపోతున్నారు. లక్ష రూపాయలు దాటడంతో, ఇక భవిష్యత్తులో బంగారం కొనగలమో లేదో అంటూ పసిడి ప్రియులు బెంబేలెత్తుతున్నారు. మధ్యతరగతి వాళ్లు పెళ్లిళ్లకు బంగారం ఎలా కొనడం ఇక కలగా మిగిలిపోతుందని మరికొందరు వాపోతున్నారు. బంగారం రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్గెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వినియోగదారుల గుండెలు గుభేల్‌మంటున్నాయి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights