ఎంతెంత దూరం.. ఇంకాస్త దూరం అన్నట్టుగా లక్ష దిశగా పరుగులు పెడుతోంది బంగారం ధర. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు గొడుతూ జెట్ స్పీడ్‌గా దూసుకుపోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూస్తున్నాం.. లక్ష రూపాయల దిశగా కంటిన్యూ అవుతోంది గోల్డ్ రన్. ఆల్‌టైమ్ హైలో బంగారం ధరలు ఉన్నాయి. నిన్నటి పోలిస్తే పది గ్రామాల బంగారం ధరం 710 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98 వేల 380కు చేరుకుంది. లక్షకు కేవలం 1620 రూపాయల దూరంలో ఉంది గోల్డ్ రేట్. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91 వేల 110కు చేరుకుంది. దీంతో బెంబేలెత్తిపోతున్నారు కొనుగోలు దారులు. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ స్టార్టవుతుండడంతో బంగారం కొనేది ఎట్టా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువ, మధ్యతరగతి జనం. అటు వెండి ధర సైతం తగ్గేదే లేదంటూ బంగారంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండిధర 98 వేల 200 గా ఉంది.
పెళ్లిళ్ల సీజన్‌లో జనానికి చుక్కలు చూపిస్తోంది పసిడి ధర. గతేడాది కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించడంతో..సీజన్‌కి ముందే కొనేసుకుందాం అనుకున్నారంతా. కానీ గోల్డ్ ధర “రన్ రాజా రన్” అంటూ దౌడ్ తీస్తోంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. మరోవైపు ఈ నెలాఖర్లో అక్షయ తృతీయ రాబోతోంది. ఒక్క గ్రామైనా బంగారం కొనేతీరాలన్న బలమైన సెంటిమెంట్ భారతీయులకు ఉంటుంది. కానీ గోల్డ్ రేట్ చూస్తుంటే..కొనేటట్టు కనిపించడం లేదని వాపోతున్నారు పసిడి ప్రియులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..