Gold Price At present: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే..

Written by RAJU

Published on:

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక ఉద్రిక్తతలతో పసిడి ధర చుక్కలనంటుతోంది. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రోజు రోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో పసిడి ధర 96వేల మార్క్‌కు చేరుకుంది. వాస్తవానికి మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే.. గత కొంతకాలం నుంచి పెరుగుతున్న ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. 16 ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,190, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.95,170 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,700 లుగా ఉంది. కాగా.. బంగారం పది గ్రాములపై రూ.10 మేర, వెండి కిలోపై రూ.100 మేర ధరలు తగ్గాయి. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,340, 24 క్యారెట్ల ధర రూ.95,320 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,190, 24 క్యారెట్ల రేటు రూ.95,170 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,09,700

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,09,700

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,700 లుగా ఉంది.

ముంబైలో రూ.99,700గా ఉంది.

బెంగళూరులో రూ.99,700

చెన్నైలో రూ.1,09,700 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights