
బంగారం ధర సంపన్నుల గుండెలు సైతం గుబేల్‌మనేలా చేస్తోంది. ముట్టుకోవాలంటేనే మంట పుట్టిస్తోంది. గత రికార్డ్స్ అన్ని చెరిపేసి ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి గోల్డ్ రేట్స్. పట్టపగ్గాల్లేకుండా బంగారం పరుగులు పెడుతోంది. లక్ష రూపాయలకు చేరువలో పసిడి ధర చేరుకుంది. శుక్రవారం సాయంత్రానికి 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ 96 వేల 540 రూపాయల ధర పలికింది. దీంతో కేవలం 2 రోజుల్లోనే 6 వేల రూపాయలు పెరిగినట్లయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్స్ ప్రకటించగా.. బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి రేట్లు పుంజుకున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటిసారి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. దేశీయంగా కూడా ఇవాళే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి రేట్లు చేరాయి. ట్రంప్ సుంకాలతో మున్ముందు ఆర్థిక అనిశ్చితులు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి.
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ట్రంప్ వాణిజ్య యుద్ధంతో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌వార్ పీక్‌స్టేజ్‌కి చేరింది. తగ్గేదే లే అన్నట్టు ఇరు దేశాలు సై అంటే సై అంటున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు రిస్క్‌లేని బంగారం వైపు మళ్లడంతో ధరలు భగ్గుమంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి