
Today Gold Rates: నేడు మరోమారు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గడిచిన రెండు రోజులలో తులానికి రూ.2,000ల పెరుగుదల నమోదైంది. ఇక నేడు మన తెలుగు రాష్ట్రలలో నిన్నటి ధర కంటే రూ.1,140 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.89,200గా ట్రేడ్ అవుతుంది. ఇంకా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. నిన్నటి ధరపై రూ.860 పెరిగి రూ.72,990గా నమోదైంది. ఈ ధరల పెరుగుదలకి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం మళ్లీ విలువైన పెట్టుబడి రూపంగా మారుతోంది.
ఇదిలా ఉండగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఒక్క గ్రాము వెండి ధర రూ.100గా ఉండగా, 10 గ్రాములు రూ.1,000గా కొనసాగుతుంది. అయితే దేశంలో వివిధ నగరాల్లో వివిధ ధరలలో వెండి ట్రేడ్ అవుతుంది. దేశంలో ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతాలలో కిలో వెండి రూ.1,00,000గా.. చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,10,000గా ట్రేడ్ అవుతుంది.