భారతీయులకు బంగారానికి అవినావభావ సంబంధం ఉంది. పెళ్ళిళ్ళు, పంక్షన్లు, పుట్టిన రోజు ఏ సందర్భంలోనైనా ముందుగా అందరి ఆలోచన బంగారం కొనుగోలు చేయడం వైపే.. బంగారం నగలు అందంకోసం మాత్రమే కాదు.. ఆర్ధిక భరోసాని ఇస్తుంది. పైగా గత కొన్ని ఏళ్లుగా బంగారాన్ని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. దీంతో పసిడి ధరలు స్థిరంగా ఉండడం లేదు. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. అంతేకాదు డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. పసిడి తర్వాత అంతగా కొనుగోలుకి ఆసక్తి చూపించే లోహం వెండి. అందుకనే వీటి ధరలను ఎప్పటికప్పుడు వినియోగ దారులు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలతో సహా దేశీయంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ లో పసిడి ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో బంగారం ఆల్ టైం హై కి చేరుకుంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,160 చేరుకుంది. ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,180లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన వరంగల్, పొద్దుటూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇవి కూడా చదవండి
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88,310లకు చేరుకోగా.. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96330లకు చేరుకుంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88160లకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 96,180 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ.88160లకు చేరుకోగా.. ప్యూర్ గోల్డ్ పది గ్రాములు 96,180లకు చేరుకుంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన కేరళ, కోల్ కత, బెంగుళూరుల్లో కూడా కొనసాగుతున్నాయి.
ఈ రోజు వెండి ధర ఎలా ఉన్నదంటే
బంగారం తర్వాత వెండి ని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. వెండిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీకోసం మాత్రమే కాదు విద్యుత్ పరికరాలలో, అద్దాలు, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా కూడా యూజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వెండి కొనడానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది. నిన్నటి తో పోలిస్తే కిలోకి వంద రూపాయల మేర పెరిగి రూ. 1,10,100లకు చేరుకుంది. ఇవే ధరలు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుండగా.. ధిల్లీ వంటి రాష్ట్రాల్లో వెండి కొంత మేర తగ్గుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..