మీరు నమ్మేరు నమ్మకపోయేరు.. 1959లో పది గ్రాములు పసిడి ఫస్ట్‌టైమ్ 100 రూపాయలను టచ్ చేసింది. 20 ఏళ్ల తర్వాత 1979లో అదే పదిగ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయలైంది. అది కాస్తా 2007 నాటికి 10వేలు అయింది. ఇలా పదింతలు పెరగడానికి పట్టిన సమయం 28 ఏళ్లు. వెయ్యి నుంచి 10వేలు పెరగడానికి దాదాపు మూడు దశాబ్దాలు తీసుకున్న కనకం.. 40వేల రూపాయలు పెరగడానికి జస్ట్ నాలుగంటే నాలుగే ఏళ్లు తీసుకుంది. 2021లో తులం బంగారం 50వేలుంటే.. ఈ ఏడాది ఏకంగా 90వేలు దాటింది.
గోల్డ్ రేట్ వంద నుంచి వెయ్యి రూపాయలు పెరగడానికి 20 ఏళ్లు పట్టింది. వెయ్యి నుంచి 10వేల రూపాయలకు పెరగడానికి ఏకంగా 28 ఏళ్లు తీసుకుంది. అదే తులం బంగారం 10వేల నుంచి 50వేల రూపాయలను టచ్ చేయడానికి జస్ట్ 14 ఏళ్లు మాత్రమే పట్టింది. జాగ్రత్తగా గమనిస్తే.. 10వేలు ఎప్పుడైతే దాటిందో అప్పటి నుంచి బంగారం పరుగులు మొదలయ్యాయి. ఈ 14 ఏళ్ల పీరియడ్‌లోనే.. ప్రపంచంలో అత్యంత విలువైన మెటల్‌గా ఉన్న ప్లాటినంను కూడా క్రాస్ చేసి.. దాన్ని తొక్కుకుంటూ పైకి ఎగబాగింది గోల్డ్. అప్పటి వరకు అత్యధిక ధర పలికి.. మెటల్స్‌లో రారాజుగా బతికిన ప్లాటినం.. బంగారం దూకుడును తట్టుకోలేకపోయింది. ఇక 50వేలు దాటిన తరువాత పట్టపగ్గాలేవ్. నాలుగేళ్లు తిరిగే సరికి.. 90వేలకు వెళ్లి కూర్చుంది. 2025లో ప్రస్తుతం 98 వేల మార్క్‌ను దాటేసింది. ఈ ఏడాది చివరికల్లా లక్ష దాటి.. ఏకంగా లక్షా పాతిక వేలకు చేరుతుందన్నది తాజా అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..