Gold: నేడే అక్షయ తృతీయ.. పసిడి కొందాం పదా..

Written by RAJU

Published on:

– సంపద, శాంతికి సంకేతం

– బంగారం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి

హైదరాబాద్: అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇది చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేస్తే శుభప్రదమని చాలా మంది నమ్ముతుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర విపరీతంగా పెరిగాయి. తులం బంగారం ధర లక్ష దాటేసింది. ఇలాంటి వేళ బంగారం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు. నేటి ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలతో బంగారం దుకాణాలు కిటకిటలాడనున్నాయి.

ఈ వార్తను కూడా చ,దవండి: Special trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు

నేడే అక్షయ తృతీయ..

వేడుక ఏదైనా బంగారం కొనాల్సిందే. అందులోనూ అక్షయ తృతీయ మరీ ప్రత్యేకం. వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాం. నిజానికి ఈ రోజును లక్ష్మిదేవికి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ అంటే సంపద, శాంతి, ధన, ధర్మానికి తెరిచే ద్వారంగా శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు.

అమ్మకానికి సిద్ధమైన పసిడి దుకాణాలు..

అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారం అమ్మేందుకు పసిడి దుకాణాలు సిద్ధమయ్యాయి. కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌, వివేకానందనగర్‌, బాలాజీనగర్‌, మూసాపేట్‌ వైజంక్షన్‌లలో పదుల సంఖ్యలో పసిడి దుకాణాలు ఉన్నాయి. చిన్న దుకాణం నుంచి పెద్ద దుకాణాలను అందంగా ముస్తాబు చేశారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వారం, పది రోజులుగా పలు షాపులు ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పు చేసి బంగారం కొనుగోలు చేయొద్దని పలువురు సూచిస్తున్నారు. అప్పు చేసి కొనడం తాత్కాలిక ఆనందమే కానీ తెచ్చిన అప్పును తీర్చేందుకు పడే వేదన అంతాఇంతా కాదు. తప్పదు అనుకుంటే ఒక గ్రాము గోల్డ్‌ కాయిన్‌ లక్ష్మీదేవి రూపం లేదా బిస్కెట్ల రూపంలో కూడా లభ్యమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి పూజ చేసుకోవడం మంచిది.

జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ఇలాంటి వేళ బంగారం కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు మీ కోసం..

– బంగారం ఎంత కొంటే అంత వెండి

ఆభరణాలు ఉచితంగా ఇస్తాం. అని ఎవరైనా ప్రకటిస్తే నమ్మొద్దు. అలాంటి ఆఫర్లు ఏమి ఉండవు. ఏడాది పాటు ఫ్రీ ఇన్స్యూరెన్స్‌

ఇవ్వమని అడగాలి.

– బంగారు ఆభరణాలు కొంటే మేకింగ్‌ చార్జీలు తీసుకోం. ఓన్లీ వీఏ (వాల్యూ యాడెడ్‌) అది కూడా 2-12శాతం మాత్రమే. మిషన్‌ హ్యాండ్‌ మేడా లేదా అన్నది చూసుకోవాలి.

– పసిడి కొనుగోలు సమయంలో డెబిట్‌,

క్రెడిట్‌ కార్డులు ఉపయోగిస్తే ఎటువంటి చార్జీలు ఉండవు.

– పసిడి కొంటే 50శాతం వరకు రాయితీ

అంటున్నారు అంటే మీరు కొనే నగలపై

వీఏకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

– తప్పనిసరిగా హాల్‌మార్క్‌ ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయండి. బిల్లు ఇస్తే జీఎ్‌సటీ 3శాతం ఉంటుంది. బిల్లు వద్దనుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు.

– బంగారాన్ని డిజిటల్‌ రూపంలోనూ కొనుగోలు చేయొచ్చు. వీటిని డిజిటల్‌ గోల్డ్‌ అంటారు.

ఈ వార్తలు కూడా చదవండి

Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి

మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

మహిళపై చేయిచేసుకున్న పోలీస్

Read Latest Telangana News and National News

Updated Date – Apr 30 , 2025 | 10:56 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights