- ప్రధాని మోడీ నివాసంలో అత్యున్నత భేటీ..
- రాజ్‌నాథ్ సింగ్, అజిత్ దోవల్ హాజరు..
- సమావేశంలో త్రివిధ దళాధిపతులు..

PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నారు.
Read Also: IND W vs SA W: ఐదు వికెట్లతో చెలరేగిన స్నేహ రాణా.. భారత్ ఘన విజయం
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్‌ని సరైన ప్రతిస్పందన ఇస్తామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రతపై అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ‘‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’ భేటీ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం తర్వాత రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి కూడా ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీకి ఐదుగురు సభ్యులు సీసీఎస్‌తో పాటు రవాణా మంత్రి, ఆరోగ్య మంత్రి, వ్యవసాయ మంత్రి , రైల్వే మంత్రి కూడా హాజరవుతారని తెలుస్తోంది. సీసీఎస్‌లో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నారు.
పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్‌కి భారత్ తన దౌత్య దెబ్బని చూపించింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాటు పాకిస్తానీయులకు వీసాలు రద్దు చేసింది. అట్టారి వాఘా బోర్డర్ ని మూసేస్తున్నట్లు ప్రకటించింది.
#WATCH | PM Narendra Modi chairs a meeting with Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/Wf00S8YVQO
— ANI (@ANI) April 29, 2025